ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు

ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు

BDK: కొత్తగూడెం పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం 'ఇందిరా మహిళా శక్తి సంబరాలు' ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళల ఆత్మనిర్భరతకు ప్రభుత్వం అండగా నిలబడడం అభినందనీయమని కొనియాడారు.