ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బొత్స

ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బొత్స

E.G: కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని మండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన ఉభయగోదావరి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.