పెన్షన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెన్షన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాపట్ల: పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని నూతన లబ్ధిదారులకు పెన్షన్‌లను అందజేశారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానికులు ఎమ్మెల్యే సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.