పెరిగిన చికెన్ ధరలు

కృష్ణా: జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో చికెన్ ధరలు పెరిగాయి. ఆదివారం కేజీ చిన్న బాయిలర్ రూ.240 ఉండగా నేడు సోమవారం రూ.260కి చేరింది. పెద్ద బాయిలర్ రూ.200గా ఉంది. ఇటీవల బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ రేట్లు పడిపోగా ఇప్పుడు మెల్లమెల్లగా రేట్లు పుంజుకుంటున్నాయి. పెరుగుతున్న రేట్లతో మాంసప్రియులు నిరాశ చెందుతున్నారు.