జిల్లా కేంద్రంలో అకాల వర్షం

జిల్లా కేంద్రంలో అకాల వర్షం

జనగామ: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అకాల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఒక్క సారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.