మే 20న సమ్మెను జయప్రదం చేయండి: రమేశ్

సత్యసాయి: మే20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో కార్మికులు శనివారం కరపత్రాలు విడుదల చేశారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల గ్యారెంటీ నాణ్యత అమానుష స్థాయికి దిగిజారిందన్నారు. మరోపక్క కార్పొరేట్ కంపెనీల లాభాలు అనేక రేట్లు పెరుగుతున్నాయన్నారు. సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.