VIDEO: ఆర్టీసీ బస్సుల ఢీ… తప్పిన ప్రాణనష్టం
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఎదురుగా ఉన్న లారీని తప్పించబోయి రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సిద్దిపేట డిపో బస్సు హన్మకొండ వైపు, హన్మకొండ డిపో బస్సు కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు బస్సుల ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.