కాలువలోకి దూసుకెళ్లిన వాహనం..తప్పిన ప్రమాదం

BPT: కర్లపాలెం గణపవరం రోడ్డులోని బాపయ్య కొట్టు దగ్గర ప్రమాదం జరిగింది. పాతూరు నుంచి వస్తున్న మహీంద్ర వాహనం అదుపుతప్పి ఇసుక ఛానల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ వంతెనకు ఇరువైపులా గోడలు లేకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.