రౌడీషీటర్లు, ఆస్తి నేరస్థులపై కఠిన నిఘా.!
HYD: రౌడీషీటర్లు, ఆస్తి నేరస్థులపై కఠిన నిఘా పెట్టాలని అధికారులకు రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు ఆదేశించారు. జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు వీరి నివాసాలు, కదలికలు, రోజువారీ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సమాచారం కలిగి ఉండాలని సూచించారు. సెటిల్‌మెంట్లు, నేర చర్యల్లో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.