VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
అన్నమయ్య: రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రాయచోటి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.