VIDEO: ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం
NDL: చాగలమర్రి (M) మద్దూరు సమీపంలో ఇవాళ PRL ట్రావెల్స్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. చెన్నై నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సును చాగలమర్రి టోల్ ప్లాజా దాటిన తర్వాత లారీ రాంగ్ రూట్లో ఢీకొట్టింది. డ్రైవర్ ప్రకాశ్ రెడ్డి (28) సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రకాశ్ గాయపడగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.