'మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడితే చర్యలు'

'మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడితే చర్యలు'

ASF: సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. వాట్సాప్, ఫేస్ బుక్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు ఇబ్బందులు కలిగేలా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.