HIVపై అవగాహన కల్పించిన DMHO
ADB: ప్రపంచ HIV నియంత్రణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో కొవ్వొత్తులు వెలిగించి హెచ్ఐవీపై DMHO అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. HIV వైరస్ ద్వారా వ్యాప్తి చెందే అక్వైర్డ్ ఇమ్యునో డఫెషియెన్సీ సిండ్రోమ్ చాపకింద నీరులా జిల్లాలో వేగంగా విస్తరిస్తోందన్నారు. శుభ్రం చేయని సిరంజిలను వాడటం, స్వలింగ సంపర్కంతో ఈ వ్యాధి వ్యాపిస్తొందన్నారు.