VIDEO: మొక్కజొన్న పంటలో అగ్నిప్రమాదం
ప్రకాశం: అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లి పంచాయతీ పరిధిలో 30 ఎకరాల మొక్కజొన్న పంట బుధవారం అగ్నికి ఆహుతయ్యింది. నాలుగు రోజుల్లో మొక్కజొన్న కంకులు కోసేందుకు రైతులు సిద్ధమవగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, దురదృష్టావశాత్తు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.