రూ. 5 లక్షల సాయం అందించిన ఎమ్మెల్యే

రూ. 5 లక్షల సాయం అందించిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలంలోని కురువపల్లి పలుగుతాండకి చెందిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ ఇటీవల మరణించారు. ఆదివారం సాయంత్రం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సురేష్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించిన ఎమ్మెల్యే, తన వంతు సాయంగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.