ఈ-పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ

ఈ-పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ

KKD: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ-పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయని, ఈ-పంట నమోదులో 73%తో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని తెలిపారు.