అమరావతి ఆమోదానికి మద్దతుగా భారీ ర్యాలీ
W.G: ఏపీ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదించిన సందర్భంగా నరసాపురంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు నేతృత్వంలో శివాలయం సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు 'జై అమరావతి – జై జై అమరావతి' నినాదాలతో ర్యాలీ జరిగింది. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం గర్వకారణమన్నారు.