ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

SKLM: నరసన్నపేట మండలం జమ్మూ ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. బుధవారం సాయంత్రం సైకిల్ పై కొత్తరెడ్డి కృష్ణారావు (78) ప్రధాన రహదారిలో వెళుతుండగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఒకరు బలంగా ఢీకొన్నారు. క్షతగాత్రున్ని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.