పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్ట్
KKD: కాట్రావులపల్లి గ్రామ శివారులో ఎస్సై యు.వి. శివ నాగబాబు సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి దాడి నిర్వహించారు. ఈ చర్యల్లో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 14,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల పరిధిలో జూద సమాచారం తెలిస్తే సమాచారం అందించాలని సీఐ వై.ఆర్.కె. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.