పకడ్బందీగా నీట్, పాలీసెట్ పరీక్షలు

పకడ్బందీగా నీట్, పాలీసెట్ పరీక్షలు

బాపట్ల జిల్లాలో నీట్, పాలీసెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఏప్రిల్ 25న పాలీసెట్, మే 3న నీట్ పరీక్షలు జరగనున్నాయన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.