బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

తిరుపతి: తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలారావు అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాల సమర్పణ చేస్తారన్నారు. రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు.