'టన్ను మామిడిపండ్లను ఉచితంగా పంచిపెట్టాడు'

WGL: రూ.30వేలు విలువ చేసే టన్ను మామిడికాయలను రైతు ఉచితంగా పంచిన ఘటన వరంగల్‌లో జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లందకి చెందిన రైతు బుస్సా ఎల్లస్వామి టన్ను మామిడి పండ్లను విక్రయించేందుకు సోమవారం వరంగల్‌కి తీసుకొచ్చాడు. నాణ్యత తక్కువగా ఉందని పండ్ల వ్యాపారులు రూ. 1000కే అడిగారు. రూ.20వేలైనా వస్తాయనుకుంటే 1000కే అడిగారని రైతు వాపోయాడు.