అడవి సంపదతో ఆరోగ్య రాగం

MHBD: గంగారం మండలంలోని అడవి బిడ్డలు ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వుతో లడ్డూలు తయారు చేస్తున్నారు. బెల్లం, నువ్వులు, పల్లీలు, యాలకుల పొడీలతో రుచికరంగా తయారైన ఈ లడ్డూలు రక్తహీనతను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కండరాల నొప్పులను తగ్గించడంలోనూ సహాయపడతాయి. అడవి నుంచి సేకరించిన ఈ అరుదైన పుష్పంతో తయారైన లడ్డూలు ఆరోగ్యానికి వరం.