పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్
బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలోని నెహ్రూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ షలీమా, ఎంపీడీవో బాబురావు పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయా అనే విషయాన్ని వారు పరిశీలించి, కేంద్రంలో తీసుకున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.