అక్రమంగా తరలిస్తున్న 60 గోవుల పట్టివేత

MLG: వెంకటాపురం మండలంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఒక కంటైనర్, ఒక బొలెరో వాహనాలను శనివారం పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాదుకు సుమారు 60కి పైగా పశువులను తరలిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసి పశువులను గోశాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.