హిందూపురం మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
సత్యసాయి: హిందూపురం మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రామాంజనేయులు రూ. 7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కొన్ని నెలలుగా హిందూపురం మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారుల అవినీతి ఎక్కువగా ఉందని ఏసీబి అధికారులకు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించారు.