సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
ATP: అనంతపురం 34వ డివిజన్‌లోని 74వ సచివాలయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పది మంది సిబ్బందికి ముగ్గురే ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ విజిట్‌లో ఉన్న వారికి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.