రేపు ఉచిత వైద్య శిబిరం

CTR: నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 10వ శుక్రవారం ఉదయం ప్రముఖ హాస్పిటల్ అన్నా గౌరి వైద్యుల పర్యవేక్షణలో పేదల కోసం ఉచిత మెడికల్ క్యాంపు ఉంటుందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.