'ఫ్యామిలీ ముస్తాబుపై అవగాహన కల్పించాలి'
PPM: ఫ్యామిలీ ముస్తాబుపై మహిళా సంఘాలు సభ్యులుకు అవగాహన కల్పించాలని వెలుగు ఏపీఎం రెడ్డి శ్రీరాములు తెలిపారు. గురువారం పాచిపెంట వెలుగు కార్యాలయంలో ఈ నారీలకు, వీవోఏలకు సమావేశం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో కూరగాయలు పెంచుకోవాలని, ఇల్లును వారానికి శుభ్రం చెయ్యాలని, కూరగాయలు ఉప్పునీటితో శుభ్రం చేసుకొని వినియోగించాలని కోరారు.