HYD సుందరయ్య పార్కులో భారీ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు
HYD: సుందరయ్య పార్కులో కొన్ని చోట్ల లైట్లు లేకపోవడం, మరి కొన్ని మరమ్మతులు జరగక ఇబ్బందులు కలుగుతున్న అంశాన్ని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గత 50 రోజుల నుంచి జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్తూ, నిరసనలు తెలిపింది. దీని పై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు లైట్ల ఏర్పాటు, మరమ్మతు చర్యలు పూర్తి చేసి పూర్తి లైటింగ్ వచ్చేలా చర్యలు తీసుకున్నారు.