రాగల రెండు రోజులపాటు వర్షాలు..!
BDK: రాగల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్లో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను కాపాడుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.