దసరా మహోత్సవాలకు పందిరి రాట ముహూర్తం

కోనసీమ: ద్వారపూడి బంగారమ్మ కాలనీలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గమ్మ ఆలయంలో వ్యవస్థాపకుడు గోకాడ ప్రకాశం ఆధ్వర్యంలో ఆదివారం రాట ముహూర్తం జరిగింది. తొలుత భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం వందలమంది భవానీలు దీక్ష ధరిస్తారు. మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపు నిర్వహిస్తారు.