నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ.7,380 కోట్లు
GNTR: నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ.7,380.70 కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం జరిగినట్లు మంత్రి నారాయణ చెప్పారు. CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. జనవరిలోగా సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రోడ్డుకు కలుపుతామన్నారు. జాతీయ రహదారికి కలిపే ప్రక్రియా వేగంగా సాగుతోందన్నారు.