'వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలి'

'వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలి'

SRPT: కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మున్సిపల్ ఛైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ కోరారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో 35 వార్డుల కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.