మార్కాపురం కలెక్టర్‌ను కలిసిన ఉపాధ్యాయులు
మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను తన ఛాంబర్‌లో శుక్రవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 14న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్రను ఆధారం చేసుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశామని, బహుమతుల ప్రధానోత్సవాన్ని హాజరుకావాలని కలెక్టర్‌ను కోరారు.