యూరియా కోసం భారీ క్యూ లైన్

యూరియా కోసం భారీ క్యూ లైన్

SRPT: నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు శుక్రవారం ఉదయం భారీ క్యూ కట్టారు. గత 15 రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నామని, లైన్‌లో గంటల తరబడి నుంచున్న ఒక్క బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులపై కక్ష సాధింపు చర్యలను మానుకొని యూరియాను సరఫరా చేయాలన్నారు.