'బైసన్' ఓటీటీకి వచ్చేది ఆ రోజేనా?
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన మూవీ 'బైసన్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అక్టోబర్ 24న తెలుగులో విడుదల చేశారు. నవంబర్ 21 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి రానుందని టాక్. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.