'పద్ధతి మార్చుకొని పనిచేయండి.. లేక‌పోతే లైసెన్స్‌ బ్లాక్ లిస్ట్‌లోకి’

'పద్ధతి మార్చుకొని పనిచేయండి.. లేక‌పోతే లైసెన్స్‌ బ్లాక్ లిస్ట్‌లోకి’

BHNG: పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్క‌ర్‌రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖాన‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి శానిటేషన్ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి నిర్వ‌హ‌ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.