వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన కమిషనర్

వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన కమిషనర్

HYD: లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను GHMC కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. ఈరోజు మూసారాంబాగ్, మలక్ పేట సర్కిళ్ల పరిధిలో సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. మూసారాంబాగ్ వంతెన సహా ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు. మూసీ వెంబడి ప్రయాణిస్తూ నీటి ప్రవాహ ఉద్ధృతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.