VIDEO: అక్రమ ఇసుక తరలింపుపై ప్రజల ఆగ్రహం
NRPT: చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగు నుంచి కురుమూర్తి స్వామి ఘాట్ రోడ్డు పనుల కోసం ఇసుకను రోజుకు అనుమతించిన 25 ట్రిప్పుల పరిమితిని మించి 200 ట్రిప్పుల వరకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. కలెక్టర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.