హోలీ పండుగను బాధ్యతగా జరుపుకోవాలి: ఎస్పీ

అన్నమయ్య: హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఆనందంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా హోలీ పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.