VIDEO: ఓటు హక్కుపై చిన్నారుల నృత్య ప్రదర్శన
MNCL: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు.