రంజాన్ పండుగ.. ఈద్గాలను సందర్శించిన సీపీ

రంజాన్ పండుగ.. ఈద్గాలను సందర్శించిన సీపీ

NZB: రంజాన్ పండగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని పలు ఈద్గాలను సీపీ పీ.సాయి చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని  ప్రధాన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.