కొట్టుకుపోయిన హైవే.. రంగంలోకి ఆర్మీ

కొట్టుకుపోయిన హైవే.. రంగంలోకి ఆర్మీ

MDK: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హవేలీ ఘనాపూర్ మండలంలోని పోచమ్మరాల్ వద్ద 765 డీ జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజల రాకపోకల కోసం తాత్కాలిక సహాయక సహకారాలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.