మహాదేవర లింగేశ్వర స్వామి దేవాలయానికి పంచలోహ విగ్రహాలు అందజేత

మహాదేవర లింగేశ్వర స్వామి దేవాలయానికి పంచలోహ విగ్రహాలు అందజేత

సూర్యాపేట: తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవర లింగేశ్వర స్వామి దేవాలయానికి దాతలు నూతన పంచలోహ విగ్రహాలను గురువారం అందజేశారు. ఈ మేరకు అర్చకులు శేషాద్రి శర్మ, రామాచార్యుల ఆధ్వర్యంలో పంచలోహ విగ్రహాలకు ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు సంతోష్ సరస్వతి, బుక్క లక్ష్మయ్య భాగ్యలక్ష్మి, తల్లాడ కేదారి పద్మ, రాజేంద్రప్రసాద్ నిర్మల, రవీందర్ రావు పాల్గొన్నారు.