మురుగునీటి సమస్యకు పరిష్కారం

PLD: ఇటీవలి భారీ వర్షాలకు గురజాల మండలంలోని పలు రహదారులు జలమయం కావడంతో, మంగళవారం నగర పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. గ్రంథాలయం వద్ద క్రేన్ సహాయంతో మురుగు కాలువలపై పేరుకుపోయిన బండరాళ్లను, పూడికను తొలగించి, వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు. తొలగించిన చెత్తను కార్మికులు ట్రాక్టర్లలో తరలించారు.