చెరువులను తలపిస్తున్న రహదారులు

చెరువులను తలపిస్తున్న రహదారులు

BPT: అమృతలూరు హైస్కూల్ ముందుగా యలవర్రు వెళ్లే ఆర్అండ్బి రోడ్డు గుంతలమయమై చెరువులను తలపిస్తోంది. ఈ మార్గంలోనే హైస్కూల్ విద్యార్థులు, తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తుంటారు. అయినా గుంతలను కూడా పూడ్చటం లేదని స్థానికులు తెలిపారు. కనీసం విద్యార్థుల కోసమైనా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.