'అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు జారీ'
WNP: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు కావడం జరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 239 ప్రకారం 2022లో జారి చేసిన అక్రిడేషన్ కార్డుల కాల పరమతి ముగిస్తున్నందున మరో రెండు సంవత్సరాలతో కూడిన కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.