ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

AP: విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీలోకి ఇన్ ఫ్లో 5,04,969 క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 4,93,822 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమై, బ్యారేజీ గేట్లను తెరిచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.