VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగిన తనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందని సమస్యలను పరిష్కరించేందుకే గ్రామ గ్రామాన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. విన్నకోట గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో శుక్రవారం ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.